సరదాగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత మంచి కాఫీ ఒకటి తాగుతూ కాలక్షేపం కోసం టీవీ పెట్టుకొని చూద్దామని కూర్చున్నఇదొగో ఇంకేముంది ఈ తపాలా కి ఆలోచన వచ్చింది.
ఒక చోట క్రికెట్ అట వస్తుంది, ఆటలు శరీరానికే కాకుండా మనసుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయంటారు.
కానీ కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చొని టీవీ లో క్రికెట్ చుస్తే మాత్రం ఆట అయ్యాక తలనొప్పి తప్ప ఇంకేమి రాదు. సరేలే స్కోరు ఫాలో అవుతూ ఇంకొకటేధైన చూద్దామని ఛానల్ మార్చాను.
మరో చోట ఎప్పటికి ఇప్పటికే చాలా సార్లు చాలా పార్టీలు మారిన ఒక రాజకీయ నేత కొత్తగా వేరే పార్టీ లో చేరాడని, నేత వదిలేసిన పాత పార్టీ కి చెందినా వ్యక్తీ, నేత కొత్తగా చేరిన పార్టీకి చెందిన వ్యక్తి ఒకరిపి ఒకరు పిడిగుద్దుల లాంటి మాటాల వర్షం కురిపించు కుంటున్న ఒక ప్రత్యెక కార్యక్రమం. చూస్తుంటే నాకే జాలేసిన్ది వాళ్ళు పడే ఆవేదనకీ. కార్యక్రమం లో కొసమెరుపేంటంటే ఇంటికేల్లెతప్పుడు ఇద్దరు కలిసి సరదాగా వెళతాం, ఇంతసేపూ పనులు మానుకుని చూస్తున్నా నేణే అసలు జాలి కి అర్హుడిని.