భాష
భాష ఒక వ్యక్తి తన భావనలను తెలపడానికి ఉపయోగ పడే ముఖ్య మాధ్యమం. నా వృత్తిరీత్యా నేను ఇటలీ, జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్, స్విట్జెర్లాండ్ లాంటి దేశాలు తిరగాల్సి వచ్చింది. ప్రవృత్తిరీత్యా నేను వెళ్ళిన ప్రతి చోటా అక్కడి భాషనీ వారి వారి వ్యక్తికరణను గమనిస్తూ వచ్చాను. నా అభిప్రాయం లో మన దక్షిణ భారత దేశ భాషలైన పంచ ద్రావిడ భాషలు (తెలుగు, కన్నడము , తమిళము, మళయాళము, తులు) ఒకదానికి ఒకటి కొంత లో కొంత సంబంధం కలిగి ఉండి, వాటి వాటి ప్రత్యేకతలు కలిగినట్టుగా ఐరోపా దేశ భాషలు కూడా ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నట్టు ఉండి వాటి వాటి ప్రతేకతలు కలిగుంటై.
ఎవరు అవునన్నా కాదన్నా మన భాషలకు అన్నిటికి మూలం సంస్కృతం, లిపి లో చాలా తేడాలున్న భాషలోని అక్షరమాల గుణింతాలు పదాలు, సంధులు, సమాసాలు చాల వరకు సంసృతం లో నుంచి వచ్చినవే. అలాగే ఐరోపా దేశ భాషలన్నిటికి మూలం లాటిన్ బాష.
తెలుగుని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వర్ణించారు. బ్రౌన్ రొండు భాషలలో తనకున్న అమోగా ప్రతిభ వాళ్ళ అంతటి పోలిక చెప్పగలిగారు. నాకున్న తెలుగు పరిజ్ఞానం తో న ఇటలీ పర్యటనలో తెలుగుకి ఇటాలియన్ కి ఉన్న సంబంధం ఏంటో కొంచం గమనిoచటం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం విన్న ఏ శబ్దన్నైన తెలుగు భాష లిపి లో మనం రాయవచ్చు అలరాసిన దానిని ఎవరు మల్లి తెలుగులో చదివినా అదే శబ్దం వినిపిస్తుంది. ఇటువంటి ప్రత్యేకత ఉన్న అతి కొద్ది భాషలలో తెలుగు ఇటాలియన్ కుడా ఉన్నాయ్. సంఖ్యామాల, కొన్ని వాడుక పదాలలో కూడా కొంత సామీప్యం ఉంటుంది. ఉదాహరణకు ఇటాలియన్ లో పదిని దషి అంటారు, అదే మన గ్రాంధిక తెలుగులో దశ అంటాము.
ఏది ఏమైనా దేశభాషలందు తెలుగులెస్స, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ భారత భూమిని.